ప్రభుత్వ బడిలోనమోదు సంఖ్య పెంచి విజయవంతం చేయండి
రవికిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట/తడ:-
బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా తడ మండలంలో మొట్టమొదట బడి ఈడు కలిగిన బాల బాలికలను బడిలో ముందుగానే చేర్చే లక్ష్యముగా నెరవేరాలని, నమోదు సంఖ్య పెంచవలెను, ముఖ్యంగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేసిన మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో 60 మంది విద్యార్థులు తక్కువ కాకుండా ఎన్రోల్మెంట్ ఉండవలెనని, తరువాత బడిలో చదువుకుంటూ బడిమానివేసిన బడి బయట పిల్లల వివరాలు సేకరించి వారిని బడిలో తిరిగి తప్పక చేర్చవలసిన బాధ్యత మనందరి పైన ఉన్నదని ఏ ఒక్కరు బడిబయట ఉండరాదని తడ మండల విద్యాశాఖ అధికారులు వేములు , మల్లికార్జునరావు తెలియజేశారు. ఎన్రోల్మెంట్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా జూన్ ఒకటో తేదీ జిల్లా నుంచి ప్రచార రథం తడ మండలంకు వస్తోందని తెలియజేశారు, ప్రచార రథంతో పాటు జిల్లా అధికారులు కూడా పాల్గొంటారని ముఖ్యంగా జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి ఎన్ కుమార్, స్థానిక శాసనసభ్యులు డా " నెలవల విజయశ్రీ మరియు మండలంలోని నాయకులు, మండల స్థాయి అధికారులు , ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ మిత్రులు విద్యార్థులు, తల్లిదండ్రులు మండలంలో ఈ సంవత్సరం పదవ తరగతిలో టాపర్స్ ,500 పై గా మార్కులు సాధించిన విద్యార్థులు మొదలగువారు అందరూ
ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు.
Post a Comment