గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ విధ్వంస పాలనను కప్పిపుచ్చుకోవడానికే మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య అబద్ధపు ప్రచారాలు:- ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ
రవికిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, ఇసుక దోపిడీతో భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టిన చరిత్ర వారిదని సూళ్లూరుపేట నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే
డాక్టర్ నెలవల విజయశ్రీ* తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల చేత ఘోరంగా తిరస్కరించబడిన వైఎస్సార్‌సీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఉనికి కోసమే కూటమి ప్రభుత్వంపై అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
మంగళవారం ఆమె మీడియ సమావేశంలో ఓ ప్రకటన విడుదల చేస్తూ వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు:
పేదల బియ్యాన్ని కొల్లగొట్టిన వైఎస్సార్‌సీపీ రేషన్ మాఫియా:
"గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ హయాంలో పేద ప్రజల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యాన్ని అడ్డగోలుగా నల్లబజారుకు తరలించారు. కాకినాడ పోర్టు కేంద్రంగా రాష్ట్రవ్యాప్తంగా సాగిన 'రేషన్ మాఫియా' వెనుక ఎవరి హస్తం ఉందో, ఏయే వైఎస్సార్‌సీపీ పెద్దల జేబుల్లోకి కోట్లాది రూపాయల అక్రమ సంపాదన వెళ్ళిందో ప్రజలందరికీ తెలుసు. ఎండీయూ ( ఎం డి యు ) వాహనాల పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి, రేషన్ పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. మా కూటమి ప్రభుత్వం రాగానే రేషన్ మాఫియా గుట్టురట్టు చేసి, పేదలకు అందాల్సిన ప్రతి గింజనూ పారదర్శకంగా అందిస్తున్నాం."
మాది నిజమైన అభివృద్ధి పాలన – సూళ్లూరుపేట ప్రగతి పథంలో:
"గత ప్రభుత్వ హయాంలో సూళ్లూరుపేట నియోజకవర్గంలో రోడ్లు గుంతలమయమై, కనీస మౌలిక సదుపాయాలు కరువై అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పెండింగ్ ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్నాం. నియోజకవర్గవ్యాప్తంగా రోడ్ల పునర్నిర్మాణం, తాగునీరు, సాగునీటి ప్రాజెక్టుల ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టాం. పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్ అయిన మన ప్రాంతంలో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను, కొత్త పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నాం."
రాజ్యాంగబద్ధమైన పాలన కూటమిదే – వైఎస్సార్‌సీపీది గుండా రాజ్యం:
"మా ప్రభుత్వానికి వ్యవస్థలను నిర్మించడం, ప్రజలకు రక్షణ కల్పించడం బాగా తెలుసు. గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ హయాంలో రాష్ట్రంలో 'గుండా రాజ్యం' నడిచింది. చట్టాన్ని చుట్టాలుగా మార్చుకుని, ప్రతిపక్షాలపై దాడులు చేసి, భయానక వాతావరణం సృష్టించిన వైఎస్సార్‌సీపీ నేతలు ఈ రోజు నిబంధనల గురించి మాట్లాడటం హాస్యాస్పదం."
కల్తీ మద్యం, డ్రగ్స్ మాఫియాతో ప్రజల ప్రాణాలతో ఆటలు:
"గత ప్రభుత్వంలో సొంత బ్రాండ్ల పేరుతో నాసిరకం, కల్తీ లిక్కర్ అమ్మి సామాన్య ప్రజల ప్రాణాలను బలితీసుకున్నారు. అంతేకాకుండా, రాష్ట్ర యువత భవిష్యత్తును నాశనం చేస్తూ డ్రగ్స్, గంజాయి సంస్కృతిని విస్తరించింది వైఎస్సార్‌సీపీ నేతలే. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కల్తీ మద్యం, డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపాము."
పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలపై మోయలేని భారం:
"గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అడ్డగోలుగా పన్నులు బాది దేశంలోనే అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలబెట్టింది. రవాణా రంగాన్ని కుదేలు చేసి, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు కారణమైన వైఎస్సార్‌సీపీ నాయకులు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారు?"
కుటుంబ రాజకీయాలు – సొంత లబ్ధికే ప్రాధాన్యత:
వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు కేవలం 'కుటుంబ రాజకీయాలు', సొంత లాభాల కోసమే పరిపాలన సాగించారు తప్ప సామాన్య కార్యకర్తలను, ప్రజలను పట్టించుకోలేదు. ప్రజాస్వామ్యాన్ని కుటుంబ జాగీరుగా మార్చిన చరిత్ర మీది."
భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసింది వైఎస్సార్‌సీపీనే:
"గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ తుగ్లక్ ఇసుక విధానాల వల్ల భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి, ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి దేశమంతా చూసింది. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పారదర్శక విధానంతో చౌకగా ఇసుకను సామాన్యులకు, భవన నిర్మాణ కార్మికులకు అందుబాటులోకి తెచ్చి, కార్మిక రంగానికి నిజమైన ఊతం ఇచ్చింది."
పరిశ్రమల వేధింపులు – పారిపోయిన కంపెనీలు:
"వైఎస్సార్‌సీపీ హయాంలో 'జె-ట్యాక్స్' వేధింపులు భరించలేక ఎన్నో ప్రతిష్టాత్మక కంపెనీలు రాష్ట్రం వదిలి పారిపోయిన మాట వాస్తవం కాదా? కూటమి ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలకు పూర్తి భరోసా కల్పిస్తున్నాం, పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో అనుమతులతో వేగంగా అడుగులు వేస్తున్నాం."
మాజీ ఎమ్మెల్యే సంజీవయ్యకు ప్రస్తుత ఎమ్మెల్యే సూటి హితవు:
గత ఐదేళ్ల మీ విధ్వంసకర, ప్రతీకార పాలనను చూసి విసిగిపోయిన ప్రజలు మిమ్మల్ని పాతాళానికి తొక్కారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న ఆదరణను తట్టుకోలేకనే మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య ఇటువంటి అబద్ధపు ప్రచారాలకు తెరలేపారు. సంజీవయ్య గారూ... మీ ఆందోళనలు ఆపి, ఇకనైనా మీరు ప్రశాంతంగా విశ్రాంతి (రెస్ట్) తీసుకుని, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ప్రజలు మాకు స్పష్టమైన తీర్పు ఇచ్చారు, ఈ రాష్ట్రాన్ని, సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని ఎలా చక్కగా పాలించాలో మా కూటమి ప్రభుత్వానికి బాగా తెలుసు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమికి చెందిన తెలుగుదేశం, జనసేన, బిజెపి ముఖ్య నాయకులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Post a Comment