మహానాడులో 1,76,542 మంది ప్రతినిధుల హాజరుతో రాష్ట్రంలో మొదటి స్థానం లో నిలిచిన నెల్లూరు పార్లమెంట్. .

మహానాడులో  1,76,542 మంది  ప్రతినిధుల హాజరుతో రాష్ట్రంలో మొదటి స్థానం  లో నిలిచిన నెల్లూరు పార్లమెంట్. .

 రాష్ట్రం లో  అగ్రస్థానంలో నిలిచిన  మొదటి 10 క్లాస్టర్లు లో ఐదు క్లస్టర్లు నెల్లూరు పార్లమెంట్ నుండే.

 వర్చువల్ గా జరిగిన మహానాడు లో నెల్లూరు పార్లమెంట్ ను అగ్ర స్థానంలో నిలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.

 చట్టం అయిన కాకపోయినా వచ్చే ఎన్నికల్లో మహిళలకు చట్ట సభలలో  33 శాతం సీట్లు కేటాయిస్తామని చరిత్రాత్మక తీర్మానం చేసిన మహానాడు.

 ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన లోకేష్ గారికి ఈ తీర్మానాన్ని ఆమోదించిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు.


  చేజర్ల

నెల్లూరు లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వేంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ

 తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక గారి జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం మే నెల 27, 28 ,29 తేదీల్లో మహానాడు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది.

 ఈ సంవత్సరం మహానాడును నెల్లూరులో నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించడం,దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో, అంతర్జాతీయ పరిణామాల నేపద్యంలో ఇంధన పొదుపు పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపు నివ్వడం దానికి అనుగుణంగా నెల్లూరు లో జరగవలసిన మహానాడు ను రద్దు చేసి హైబ్రిడ్ విధానంలో తెలుగుదేశం పార్టీ మహానాడును నిర్వహించింది.

 నిన్న,మొన్న హైబ్రిడ్ విధానంలో వర్చువల్  గా జరిగిన మహానాడు లో 17 లక్షల మంది ప్రతినిధులు పాల్గొని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కొత్త చరిత్ర సృష్టించారు.

ఈ మహానాడులో రెండు రోజులలో నెల్లూరు పార్లమెంట్ నుండి 1,76,542 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.ప్రతినిధుల హాజరులో రాష్ట్రం లోనే నెల్లూరు పార్లమెంట్ మొదటి స్థానం లో నిలిచింది.

 అదేవిధంగా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిన మొట్ట మొదటి 10 క్లస్టర్లు లో 5 క్లస్టర్లు నెల్లూరు పార్లమెంట్ నుండే ఉన్నాయి.

నెల్లూరు జరగవలసిన మహానాడు రద్దు ఆయనా వర్చువల్ గా జరిగిన మహానాడు లో నెల్లూరు పార్లమెంట్ ను మొట్ట మొదటి స్థానంలో నిలవడం సంతోషదాయకం.నెల్లూరు పార్లమెంట్ ను అగ్ర స్థానంలో నిలిపిన శాసనసభ్యులకు,పార్లమెంట్ సభ్యులకు, గౌరవ మంత్రి వర్యుల కు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ నెల్లూరు పార్లమెంట్ తరుపున ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.

 అదే విధంగా నిన్న,మొన్న జరిగిన మహానాడులో రాష్టానికి చెందిన అనేక అంశాలను చర్చించి తీర్మానాలు చేయడం జరిగింది.

పార్లమెంట్ లో చట్టం అయినా,కాకపోయినా చట్టసభల లో మహిళకు తెలుగుదేశం పార్టీ 33 శాతం సీట్లు కేటాయిస్తామని నారా లోకేష్ గారు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా,శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ తీర్మానాన్ని అనుమతించి ఆమోదించారు.ఇది ఒక చరిత్రాత్మక తీర్మానం.

దేశంలోనే మొట్ట మొదటి సారిగా మహిళలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల ను స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కల్పించారు.నేడు చట్ట సభలలో 33 శాతం సీట్లు కేటాయిస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు,నారా లోకేష్ గారు ప్రకటించి దేశానికే ఆదర్శంగా నిలిచారు.

ఇందుకు వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ, అంచనాలకు మించి మహానాడు ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget