"మహిళల పై దాడులు దుర్మార్గం- పూజిత"


 "మహిళల పై దాడులు దుర్మార్గం- పూజిత"

SPSR నెల్లూరు జిల్లా

తేది 03.04.2026

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్  కాకాణి పూజిత గారు

మీడియా సమావేశంలో పాల్గొన్న  వైఎస్సార్ సీపీ  జోనల్ మహిళా అధ్యక్షురాలు మొయిళ్ళ గౌరీ గారు, వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కాకుటూరు లక్ష్మీ సునంద గారు, తోటపల్లి గూడూరు జెడ్పీటీసీ శేషమ్మ గారు,  మనుబోలు ఎంపీపీ వజ్రమ్మ గారు, వైఎస్ఆర్ సిపి జిల్లా ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి గారు, రూరల్ మహిళా అధ్యక్షురాలు రమాదేవి గారు,సర్వేపల్లి మహిళా అధ్యక్షురాలు సంధ్య రాణి గారు, 

 కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు 

పట్టపగలే అందరూ చూస్తుండగా మహిళపై దాడి చేయడం దుర్మార్గం 

 హోం మంత్రి మహిళ అయ్యుండి కూడా మహిళలపై దాడులు జరగడం దురదృష్టకరం 

 మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు, జరుగుతుంటే చంద్రబాబు,ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లారు  జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తప్పు చేస్తే, పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి లో ఎందుకు చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నాడు  చంద్రబాబు నాయుడు మహిళల రక్షణకు ఏమి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి  జగనన్న పాలనలో మహిళల వైపు చూడాలంటేనే భయపడే విధంగా చట్టాలు తీసుకొచ్చారు

 ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒకచోట మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, జరుగుతూనే ఉన్నాయి

 మహిళలపై దాడులు ఇదేవిధంగా జరుగుతుంటే ప్రజలు కూటమి ప్రభుత్వం పై తిరగబడే రోజు త్వరలోనే వస్తుంది  

 కాకాణి పూజితమ్మ స్క్రోలింగ్ పాయింట్స్ 


 రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై స్వయంగా కూటమి నేతలే అత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు

మీడియా ముందు స్టేట్మెంట్ లు ఇవ్వడానికి తప్ప, చంద్రబాబు వ్యాఖ్యలు కార్యాచరణ దాల్చింది శూన్యం

తమకు అన్యాయం జరిగిందని బయటకు వచ్చినా, ప్రశ్నించినా,వారిపై అక్రమ కేసులు మోపుతున్నారు

కూటమి ఎమ్మెల్యేలు ఇంతటి దారుణాలకు ఒడిగడుతున్నా వారి మీద చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారు 

 రైల్వే కోడూరు  కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కారణంగా బాధించబడ్డ మహిళకు నేటికి న్యాయం జరగలేదు

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఉదంతంపై నేటికి వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ నోరు విప్పడం లేదు

కూటమి ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ అంటూ కాలం వెల్లదీస్తున్నారే తప్ప చర్యలు తీసుకునే సాహసం చేయడం లేదు 

రాష్ట్రంలో ఒక మహిళ హోం మంత్రిగా ఉండి కూడా పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది

పోలీసులు తప్పు చేసిన వారిని వదిలిపెట్టి బాధితులపై కేసులు నమోదు చేస్తున్నారు 

కూటమిపాలనలో పోలీసులు వారి విధులు సక్రమంగా నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నారు 

బహిరంగంగా అరవ శ్రీధర్ ఆకృత్యాలకు గురైనట్లుగా ఆరోపిస్తున్న బాధిత మహిళపై దాడిచేయించడం ఎంత వరకు సమంజసం, ఈ సంఘటన పట్ల మహిళలు కూటమి ప్రభుత్వం పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు 

బాధిత మహిళపై దాడి జరుగుతుంటే పోలీసులు, కూటమి ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు 

బాధిత మహిళ పిర్యాదులపై నేటికి న్యాయబద్ధ విచారణ జరగడం లేదు,

అరవ శ్రీధర్ పై వేటు వేశాం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దు అని ఇచ్చిన స్టేట్మెంట్ లు అన్ని వట్టి  మాటలు అని తేలిపోయాయి

కూటమి పాలనలో తప్పు చేసిన వారిపై ఏ విధమైన శిక్షలు ఉండవు, బాధితులను మాత్రం పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తారు 

పోలీసుల కళ్ళ ముందే మహిళపై దాడి జరుగుతుంటే రక్షించాల్సిన పోలీసులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పడం చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అనిపిస్తుంది 

పోలీస్ స్టేషన్ వేరు, పోలీసులు వేయరా? ఆ మహిళ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేస్తే, విచారిస్తున్నామంటూ పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిప్పుకుంటున్నారు 

పోలీసులు, ప్రభుత్వం కోసం పనిచేసే దాంట్లో  10 శాతం ప్రజల కోసం పనిచేస్తే ఇలాంటి దారుణాలు జరగవు

కూటమిపాలనలో ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం పట్ల సభ్య సమాజం తలదించుకుంటుంది 

అధికారంలోకి రాకముందు పవన్ కళ్యాణ్ మహిళలకు అన్యాయం చేస్తే  ఉపేక్షించను అని ప్రగల్బాలు పలికి, ఇప్పుడు తన పార్టీకి చెందిన ఎమ్మెల్యే లు తప్పు చేస్తున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నాడు 

అధికారం లేనప్పుడు మహిళల గురించి గొప్పగా మాట్లాడే కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక కళ్ళున్నా చూడలేని స్థితిలో ఉన్నారు 

రాష్ట్రంలో మహిళలపై దాడులు, దౌర్జన్యాలు నిత్యకృత్యం అయిపోయాయి, 

మహిళలు స్వేచ్ఛగా బయటకు వచ్చితిరగలేని పరిస్థితులు కూటమిపాలనలో చూస్తున్నాం 

కూటమిపాలనలో చోటా నాయకుల నుంచి బడా నాయకుల వరకు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడడం పరిపాటిగా మారింది 

సత్తెనపల్లిలో ఇంట్లో ఉన్న ఒంటరి మహిళ మీద కత్తి చూపించి, దౌర్జన్యం చేసి, హింసించి అఘాయిత్యానికి పాల్పడ్డారు 

కూటమిపాలనలో మనం సమాజంలో ఉన్నామా, ఆటవిక పాలనలో ఉన్నామా, అర్థం కావడం లేదు 

మహిళలపై మృగాలు లాగా దాడి చేస్తుంటే కూటమి నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు

జగనన్న పాలనలో మహిళల రక్షణ కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు

జగనన్న కి మంచి పేరు వస్తుందని ఆయన తీసుకొచ్చిన పథకాలు పక్కన పెట్టేశారు 

జగనన్న తీసుకొచ్చిన దిశా యాప్, దిశా చట్టాలు ఎటుపోయాయో, మహిళా పోలీసులు, ఎక్కడున్నారో తెలియని పరిస్థితి  

కూటమి నాయకులు ప్రచారాలలో నిమగ్నమై ఉన్నారు, పోలీసులు కూటమి నాయకులకు గిట్టని వారి మీద కేసులో పెట్టే పనిలో ఉంటే, ప్రజలను పట్టించుకునే వారెవరో అర్థం కావడం లేదు 

మహిళలపై నిత్యం దాడులు జరుగుతుంటే అడ్డుకునేది ఎవరు, ఆపేదెవరు

జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడవారి వైపు చూడాలంటే భయపడేవారు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏవిధంగా ఉంది, కూటమిపాలన ఏవిధంగా ఉందో ప్రజలకు అర్థమవుతుంది

చంద్రబాబు ఇచ్చిన హామీలు ఇవ్వకుండా ప్రజలను మోసగిస్తే, చెప్పని హామీలు కూడా నెరవేర్చిన గొప్ప నాయకుడు జగనన్న

 జగనన్న పాలనలో మహిళలందరం సురక్షితంగా, సంతోషంగా ఉన్నాం 

 కూటమి పాలనలో ఆంధ్ర రాష్ట్రం మహిళలపై నేరాలలో  రెండో స్థానంలో ఉంది 

 కూటమి ప్రభుత్వం సాధించిన ఘనతలలో ఇది కూడా ఒకటి 

 అనితకు,చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను పొగిడేందుకు హోంమంత్రి పదవి ఇవ్వలేదు, మహిళలకు మంచి చేస్తారని ఇచ్చారు 

 మా నాయకుడు జగనన్న నాయకత్వంలో మహిళలందరూ ఏకమై కూటమిపాలనలో బాధించిన మహిళలకు అండగా నిలిచి పోరాడుతాం 

 నిన్న మహిళపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి శిక్షించి, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం 

 కూటమి ప్రభుత్వం మహిళలకు న్యాయం చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచి, వారి తరపున పోరాడుతాం

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget