బిఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలి- పూజిత

 "బిఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలి- పూజిత 


SPSR నెల్లూరు జిల్లా 

తేది 04.04.2026


నెల్లూరు జిల్లా నగరం, మాగుంట లేఔట్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శాసనమండలి సభ్యులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, శాసనమండలి సభ్యురాలు వరుదు కళ్యాణి గారితో కలిసి బి.ఆర్ నాయుడు  టి టి డి చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, వెంకటేశ్వర స్వామి వారికి  ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయం వెలుపల నిరసన తెలియజేసిన  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత గారు


- స్త్రీలోలుడు బి.ఆర్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి

- బి ఆర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయకుండా కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాడు

- చంద్రబాబు కు భక్తుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, బిఆర్ నాయుడుని వెంటనే తొలగించాలి


- పూజితమ్మ స్క్రోలింగ్ పాయింట్స్

- తిరుమల తిరుపతి దేవస్థానం  చైర్మన్ బి.ఆర్ నాయుడు వెంటనే పదవి నుండి తొలగించాలి లేదా ఆయనే స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి 

- టీటీడీ చైర్మన్ పదవిలో బిఆర్ నాయుడు కొనసాగకూడదని  కోట్లాదిమంది భక్తులు కోరుకుంటున్నారు 

- బి.ఆర్ నాయుడుకు సంబంధించి వచ్చిన  వార్తలు, వీడియోలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి 

- కళంకితమైన వ్యక్తి పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగడం దారుణం 

- ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల దేవస్థాన పవిత్రతను కాపాడటంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది 

- బి ఆర్ నాయుడు  ద్వారా తమకు కావాల్సిన ప్రచారాన్ని, ఇతర ప్రయోజనాలను పొందేందుకే చంద్రబాబు వెనకేసుకొస్తున్నాడు 

- చంద్రబాబు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే వివాదాస్పద వ్యక్తులకు పదవులు కట్టబెడుతున్నారు 

- బి.ఆర్. నాయుడు గతం గురించి, ఆయనపై ఉన్న ఆరోపణల గురించి ఒక మహిళ ముందే లేఖ ద్వారా హెచ్చరించినప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటిని పట్టించుకోకుండా ఆయన్నే చైర్మన్‌గా నియమించడం చూస్తుంటే, చంద్రబాబుకి వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి, భయం, రెండూ లేవని రుజువు అవుతుంది 

- "భక్తుల మనోభావాల కంటే మాకు బి.ఆర్. నాయుడే ముఖ్యం" అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉంది

- భక్తుల మనోభావాలతో తమకు సంబంధం లేనట్లు కూటమి నాయకులు వ్యవహరిస్తున్నారు 

 - టీటీడీ వంటి ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక సంస్థకు అత్యంత నిబద్ధత, భక్తి మరియు ధర్మపరమైన ప్రవర్తన కలిగిన వ్యక్తులను మాత్రమే ఎంపిక చేయాలి 

- "శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తురాలు గా, బి.ఆర్ నాయుడు వంటి వ్యక్తితో టీటీడీని అనుసంధానించడం మాకు చాలా కష్టంగా ఉంది

- కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి బి ఆర్ నాయుడు  నియామకాన్ని రద్దు చేయాలి" 

- ​హిందూ ధర్మ పరిరక్షణలో కీలక పాత్ర పోషించే తిరుమల తిరుపతి దేవస్థానానికి  సరైన వ్యక్తిని ఎంపిక చేయాలి 

- బి ఆర్ నాయుడు తొలగించే వరకు ఆందోళనలు ఉధృతం చేస్తాం

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget