నెల్లూరు: ప్రజల దాహం తీరిస్తే రూ.50వేల గిఫ్ట్
రానున్న వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. మెట్ట ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు పశువులకు తాగునీరు అందించాలని అధికారులకు సూచించారు. ప్రజల దాహార్థి తీర్చడంలో విశేషంగా కృషి చేసిన ఎవరికైనా రూ.50వేలు బహుమతిగా ఇస్తామని కలెక్టర్ ప్రకటించారు.
Post a Comment