సూర్యాపేటలో బీహార్ కూలీల అరాచకం..
పోలీసులపై కర్రలు, రాళ్లతో దాడి..!
దాడిలో రెండు పోలీసు వాహనాలు ద్వంసం..?
ఈ షాకింగ్ ఘటన సూర్యాపేట జిల్లా లోని పాలకవీడు మండలం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిన్న సాయంత్రం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సమయంలో ఓ కార్మికుడు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో అతన్ని మిర్యాలగూడ లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఈ క్రమంలో కార్మికుని మృతికి యాజమన్య నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ.. తగిన న్యాయం చేయాలని కంపెనీ ఎదుట కార్మికుల ఆందోళనకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులపై కర్రలు, రాళ్లతో బిహార్ కార్మికులు దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులతో పాటు, పలువురు కార్మికులకు గాయాలు అయ్యాయి. ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కార్మికుల దాడిలో రెండు పోలీసు వాహనాలు ద్వంసం అయినట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో పరిస్థితి రణరంగంగా మారిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది.

Post a Comment