జీవం కోల్పోతున్న చేతివృత్తులు ఆదరణ కరువైన వృత్తులు

జీవం కోల్పోతున్న చేతివృత్తులు ఆదరణ కరువైన వృత్తులు






నెల్లూరు [వింజమూరు], రవికిరణాలు సెప్టెంబర్ 11 : 

నిషి దైనందిన జీవితంలో అభివృద్ధిపై వైపు పరుగులు పెడుతూ, మనిషికి సగటున అవసరమయ్యే ప్రతి వస్తువు మోడల్ గా మారుతున్న ఈ కాలంలో , ఇంకా చేతి వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నా కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, చేతిలో సత్తువు లేకపోయినా,శరీరం సహకరించకపోయినా, గుండె నిబ్బరంతో, ఆకలి పోరాటం చేస్తున్న వెంకటేశ్వర్లపై మేజర్ న్యూస్ ప్రత్యేక కథనం.

రెక్కాడితే కాని డొక్కాడని బడుగు జీవులు తమ కుటుంబ పోషణార్థం అనేక రకాలుగా కష్టాలు పడవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కోటి విద్యలు కూటి కొరకే అన్నట్లుగా జానెడు పొట్ట నింపుకోవడం కోసం బారెడు కష్టాలను అనుభవించక తప్పడం లేదు ప్రస్తుతం సమాజంలో ఏపూటకు ఆ పూటకు నోచుకోని ప్రజలు ఏదో ఒక రకంగా కష్టపడి పని చేసేందుకు ముందుకు వస్తుంటారు

కొండలను పిండి చేసే కండబలం ఉన్న ఆ రోజుల నుండి, ఒంట్లో శక్తిని  కోల్పోయిన నేటి వరకు ఆయన చేతిలోని ఉలి దెబ్బకు బండరాయి ఒక రూపం దాల్చుకోవడం విశేషం. వింజమూరు మండల కేంద్రంలోని బీసీ కాలనీ సమీపంలో ఎన్నో ఏళ్లగా నివాసం ఉంటున్న వెంకటేశ్వర్లు తన చేతి వృత్తినీ మరవకుండా నేటి వరకు రోళ్లు తయారు చేయడం విశేషం గా నిలుస్తున్నాడు. ప్రస్తుత సమాజంలో మిక్సీలు గ్రైండర్లు,వంటి వాటివి వాడుకలోకి వచ్చిన తర్వాత  రోళ్లను కొనుగోలు చేసే వినియోగదారులు లేక జీవనం కోల్పోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఒక రోజుకు రెండు రోలును తయారు చేయగలమని, వాటి సైజును బట్టి అమ్మడం జరుగుతుందన్నారు. గిట్టుబాటు లేక అమ్మకం కూడా జరగడం లేదని కుటుంబ పోషణ భారం అవుతుందన్నారు. గత 35 సంవత్సరాలుగా ఈ చేతివృత్తినే నమ్ముకొని కాలం వెళ్ళదిస్తున్నామని, వేరే వృత్తిలో కొనసాగ లేక ఈ పనినే నమ్ముకున్నామన్నారు. ప్రభుత్వాలు చొరవ తీసుకొని చేతివృత్తులకు రుణాలు మంజూరు చేసి, మా కుటుంబాలను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget