చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎస్ఐ
నెల్లూరు [అర్బన్/క్రైమ్], రవికిరణాలు జూలై 18 :
నెల్లూరు నగరంలోని నవాబుపేట రవీంద్ర భారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు విద్యార్థులకు ఎస్పీ కృష్ణకాంత్,డిఎస్పి సింధు ప్రియా,సీఐ జి వేణుగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు టూ టౌన్ ఎస్సై రెహమాన్ చట్టాల పై అవగాహన మరియు సమాజంలో జరుగుతున్నటువంటి సైబర్ నేరాలు,క్రికెట్ బెట్టింగ్లు,గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మరియు ఇన్వెస్టిట్యూడ్ సెరిమని వేర్ విల్ ది లీడర్షిప్ క్వాలిటీస్ టు ద స్టూడెంట్స్ పెంపొందే కార్యక్రమం శుక్రవారం చేపట్టారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ సెల్ ఫోన్ వాడకాలు తగ్గించి చక్కగా చదువుకోవాలని అలాగే ఫోన్లలో వచ్చే లింకులను ఓపెన్ చేయరాదని,చెడు స్నేహాలకు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని తెలియజేశారు. అదేవిధంగా విద్యార్థినీ విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఇబ్బంది కలిగితే 112 నెంబర్ కి ఫోన్ చేయాలని,విద్యార్థిని విద్యార్థులు విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు.కోట్ల రూపాయల కంటే విలువైనది ఒక చదివేనని,కావున ప్రతి విద్యార్థి చక్కగా చదువుకొని తమ పాఠశాలకు మరియు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకోరావాలని ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జోనల్ ఇంచార్జ్ శ్రీహరి స్కూలు ప్రిన్సిపాల్ నిరూపమా డీన్ శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment