ఉపాధ్యాయుల  సమస్యలు పరిష్కారం వైపు ప్రభుత్వం దృష్టి సారించాలి. 
యు టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ .
నెల్లూరుజిల్లా. తడ:-
మండలంలోని ఏపీ యుటిఎఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మండలం మహాసభలు   సోమవారం సాయంత్రం  ఎంపీపీ పాఠశాల బి ఎల్ పాడు నందు యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు జి జే రాజశేఖర్ పర్యవేక్షణలో  జరిగింది. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు జి జే రాజశేఖర్ మాట్లాడుతూ పి ఆర్ సి ని త్వరగా అమలు చేయాలని సిపిఎస్ ని రద్దు చేయాలని డి ఏ బకాయిలను  వెంట వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా  3, 4, 5, తిరగతులని హైస్కూల్లో విలీనాన్ని విరమించుకోవాలని ఖాళీగా ఉన్న 25 వేల  ఉపాధ్యాయ ఉద్యోగ పోస్టులను డీఎస్ సి  ద్వారా భర్తీ చేయాలని వీటి సాధన కోసం యు టి ఎఫ్ చేసే పోరాటాలలో ఉపాధ్యాయులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.  వీటిని సాధించేవరకు అలుపెరగని పోరాటాలు చేసి  సమస్యలను  పరిష్కరించుకోవాలని ప్రభుత్వం ఇప్పటికైనా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం వైపు దృష్టి సాధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తదనంతరం జరిగిన యుటిఎఫ్ నూతన కార్యవర్గ ఎన్నికలను యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు జి జే రాజశేఖర్ ఎన్నికల అధికారి గా వ్యవహరించారు. నూతన కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా కే భువనేశ్వరి, అధ్యక్షులుగా కే సుధాకర్, ఉపాధ్యక్షులుగా కె అరుణ కుమారి, కె టి నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎస్ బాబు, కోశాధికారిగా ఎన్ రవికుమార్, కార్యదర్శులుగా డి కుమారి, కిరణ్, జీ సుఖేష్ కుమార్, ఎం చలపతి, పీ కాంచన, వై వెంకటరమణయ్య, పీ శ్రీనివాసులు, వెంకటరమణయ్య లను నూతన కార్యవర్గ కార్యవర్గాన్ని  ఎన్నుకోవడం జరిగింది.
  
Post a Comment